Chinthapally : ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..!
కోరిన కోరికలు తీర్చే దైవంగా కొంగు బంగారమై హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి ప్రక్కన చింతపల్లి మండల పరిధిలోని మదనాపురం గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితం నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత వారం రోజుల నుండి జరుగుతున్నాయి.

Chinthapally : ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..!
చింతపల్లి, మనసాక్షి :
కోరిన కోరికలు తీర్చే దైవంగా కొంగు బంగారమై హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి ప్రక్కన చింతపల్లి మండల పరిధిలోని మదనాపురం గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితం నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత వారం రోజుల నుండి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఘనంగా వేలాది మంది భక్తుల నడుమ స్వామివారి రథోత్సవాన్ని జై శ్రీ లక్ష్మీనరసింహ అంటూ యువకులు నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో రధాన్ని లాగారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని కనులారా విందంగా తిలకించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు దాతలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందజేశారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంగిటి విజయలక్ష్మి శ్రీనివాస్ యాదవ్, దేవాలయ చైర్మన్ డేరంగుల మహేష్ మాల్
మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ జెడ్పిటిసి జంగిటి నరసింహ యాదవ్, మాజీ జెడ్పిటిసి జటావత్ హరి నాయక్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, సిద్దాల అశోక్, కొప్పుల జంగయ్య గౌడ్, మునుకుంట్ల శేఖర్ గౌడ్, మర్ల వెంకటయ్య, సందు పట్ల లక్ష్మణ్ సాగర్, చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల వెంకటేశ్వర్లు, ఎస్సై ముత్యాల రామ్మూర్తి, వేద పండితులు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి జి. శేఖర్,శ్రీనివాస్ గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









