viralBreaking Newsజాతీయం

Video : కామంతో కళ్ళు మూసుకుపోయి.. నడిరోడ్డుపై.. (వీడియో)

Video : కామంతో కళ్ళు మూసుకుపోయి.. నడిరోడ్డుపై.. (వీడియో)

మన సాక్షి వెబ్ డెస్క్

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం భయపడటం లేదు. కామాంధులు ఇంకా రెచ్చిపోతున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం పెరుగుతుంది.

తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు యువతులను వేధించిన సంఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది. వెంటనే దానికి స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏప్రిల్ 4వ తేదీన రాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు యువతులు ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అర్ధరాత్రి కావడంతో రోడ్డుపై ఎవరూ లేరు. అంతలోనే ఓ యువకుడు వెనుక నుంచి వచ్చి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. ఓ యువతిని గట్టిగా పట్టుకొని ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు.

అయితే ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వ్యక్తి దాడితో వెంటనే షాక్ కు గురైన యువతులు వెంటనే తీరుకొని సాయం కోసం కేకలు వేశారు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు కోసం గాలిస్తున్నారు.

 

Viral Videos : 

  1. Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)
  2. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
  4. Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
  5. Viral Video : సింపుల్ ట్రిక్.. మరక రెండు నిమిషాల్లో తొలగించిన యువకుడు.. (వీడియో)

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు