Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!

Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!

సూర్యాపేట, మనసాక్షి :

మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నాయకులు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు మందుల సామేలు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎంపీ లు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతానికి దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన గొప్ప నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డని సీఎం తెలిపారు. రాజకీయాల్లో ఈ రోజున ప్రతి ఒక్కరు ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ రాంరెడ్డి దామోదర్ మాత్రం మనకు తండ్రినుండి వచ్చిన ఆస్తుల్ని పేదలకు పంచారని తన అత్తగారి కుటుంబం ఆస్తులు కూడా వేలాది ఎకరాలను ఇక్కడ తుంగతుర్తి ప్రజలకు దానం చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

రాం రెడ్డి దామోదర్ రెడ్డికి సంతాపం తెలియజేయవలసిందిగా రాహుల్ గాంధీ సోనియాగాంధీ మల్లికార్జున ఖర్గే లు తెలిపారని, వారి తరఫున సర్వోత్తమ్ రెడ్డికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ఏఐసిసి అన్ని విధాల అండగా ఉంటుందని, గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబానికి సహాయం చేస్తుందని అన్నారు.

ఎస్సారెస్పీ నీళ్లు కరువు ప్రాంతమైన తుంగతుర్తి కి తీసుకుని రావడంలో కీలకపాత్ర పోషించి ఈ కరువు ప్రాంతమైన ఫ్లోరైడ్ ప్రాంతమైన తుంగతుర్తిలో గోదావరి జలాలు తీసుకురావడానికి పాటుపడి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను ఒప్పించి నీళ్లు తీసుకొని వచ్చిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్ ఆర్ ఎస్ పి స్టేజ్ 2 కాలువకు పెడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రజల హర్షద్వారాల మధ్య ప్రకటించారు.

MOST READ :

  1. Nalgonda : రూ.10 వడ్డీ.. రూ.50కోట్లు వసూలు.. చివరికి కటకటాల్లోకి..!

  2. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

  3. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

  4. Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!

మరిన్ని వార్తలు