Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!
Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంకు ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై తర్జనభర్జన కొనసాగుతోంది. కులగణనకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్టు ఇవ్వలేదు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన ఫైనల్ రిపోర్ట్ ను అందజేయనున్నారు.
అయితే బుధవారం ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది పూర్తవుతుంది.
కాగా ఫిబ్రవరి మాసంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కులగణన రిపోర్టు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క వీరితోపాటు సిఎస్ శాంతి కుమారి ఉన్నారు.
సమావేశంలో కుటుంబ సర్వే గురించి చర్చించారు. కుటుంబ సర్వే విజయవంతంగా చేసినందుకు అధికారులను సీఎం అభినందించారు. కానీ ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ ఇంకా తర్జనభర్జనలోనే కొనసాగుతుంది. కులగణన రిపోర్టు వచ్చిన తర్వాత మరోసారి సమావేశమై సర్పంచ్ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
MOST READ :
-
Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Inter Exams : ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు.. పకడ్బందీగా నిర్వహించాలి..!
-
దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!









