Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మూడు విడతలుగా రుణమాఫీని అమలు చేసింది.
కానీ రుణమాఫీ అనేకమంది రైతులకు రాలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు.
రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మొదటి విడత, రెండవ విడత రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీ రెండు లక్షల లోపు రుణం ఉన్న వారందరికీ పూర్తి అయినందున.. రుణమాఫీ కానీ రైతులు వ్యవసాయ అధికారుల వద్ద ప్రత్యేక కౌంటర్లలో ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు చేసిన రైతులందరికీ స్పెషల్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.
ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లలో తప్పులతో పాటు ఇతర కారణాల తో రుణమాఫీ పొందని వారికి స్పెషల్ వెరిఫికేషన్ చేసి అర్హులందరికీ రుణమాఫీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ :
MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!
LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!
PDS : రాత్రి వేళ తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!









