MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!
MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన 100 అడుగుల జాతీయ జెండాను 15 వేల మంది విద్యార్థుల నడుమ స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహ, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గతంలో కూడా నియోజకవర్గ అభివృద్ధి చెందింది అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో స్వచ్ఛ మిర్యాలగూడ కోసం నేను నా మిర్యాలగూడ కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంతో పాటు పచ్చదనం అభివృద్ధి చేయడం, గంజాయి నిర్మూలనకు కృషి చేయడం తన వంతుగా సహకరించనున్నట్లు తెలిపారు.
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు:
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మిర్యాలగూడ నుండి ఎన్ఎస్పి క్యాంపు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు చేపట్టిన ముఖ్య ప్రదర్శన పాటలు పలువురు ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల వేషధారణ ఆకట్టుకునేలా ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, మహబూబ్ అలీ, స్కైలాబ్ నాయక్, స్థానిక కౌన్సిలర్ అమృతం దుర్గా సత్యం వివిధ సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!
Independence Day : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పగడ్బందీగా నిర్వహించాలి..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!











