Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

తెలంగాణ బ్యూరో, మన సాక్షి:

రాష్ట్రంలో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026 విద్యా సంవత్సరం జూన్ నుంచి అమలు జరిగే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని రివ్యూ సమావేశంలో చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. తొలి దశలో ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌ ప్రాంతంలో దృష్టి సారించాలని చెప్పారు.

ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకన్నా మెరుగ్గా ఉండాలని, ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని చెప్పారు.

నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని సూచించారు.

MOST READ : 

  1. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

  2. Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!

  3. PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!

  4. District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

  5. Gold Price : ఒక్క రోజులోనే ఆల్ టైం రికార్డుకు చేరిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు