Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!

TG News : మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ఆయన AMVI నియామక పత్రాలు అందజేసిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏం కోల్పోయిందో తెలిసింది అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదని, కెసిఆర్ కుటుంబంలో నలుగురు మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు.

నాయకుడు అంటే ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే హాయిగా ఉండొచ్చని, రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్నారు.

దీపావళి పండుగ వస్తే ప్రజలంతా సిచ్చు బుడ్లతో జరుపుకుంటే కొంతమంది కుటుంబం సారాబుట్లతో జరుపుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసఅన్నారు. అంతేకాకుండా సారా బుడ్లు, కుకేన్లతో పండుగలు జరుపుకున్న వారిని వదిలిపెట్టమని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు.

చట్టం పెద్దోళ్లకు, పేదోళ్లకు వేరువేరుగా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.

బడి దొంగలను చూశాము కానీ, అసెంబ్లీకి రాని వారిని ఇక్కడే చూస్తున్నామని రేవంత్ రెడ్డి చురక అంటించారు. తెలంగాణ ఏం కోల్పోలేదని హాయిగా ఫామ్ హౌస్ లో ఉండొచ్చని పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు