CM Revanth : స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. పుట్టిన రోజు నుంచి పాదయాత్ర..!
CM Revanth : స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. పుట్టిన రోజు నుంచి పాదయాత్ర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరిగింది. పత్తి పక్షాల దాడి ప్రభుత్వం పై పెరిగింది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే స్పీడ్ పెంచారు.
రాష్ట్రంలో మూసి ప్రక్షాళన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మూసీ బాధితులకు ఆటు బీఆర్ఎస్ ఇటు బిజెపి అండగా నిలుస్తామంటూ దాడికి దిగాయి. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని మించి మరింత ముందుకు దూకారు.
తన కలల ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవం అంశాన్ని రేవంత్ రెడ్డి సవాల్ గా తీసుకున్నారు. అయితే మూసీ ప్రక్షాళన విషయంలో హైదరాబాదులో పలు ప్రాంతాల్లో నిర్వాసితులు ఆందోళన వారికి ప్రతిపక్షాల మద్దతు తెలియజేయడం తెలిసిందే. మూసీ నిర్వాసితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశం విధితమే.
మూసి బాధితుల కోసం ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయాలని నిర్ణయించాడు. అందుకు అన్నద్ధమవుతున్నాడు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్పీడ్ పెంచి ఈనెల 8వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తన పుట్టినరోజును యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో జరుపుకొని అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు.
నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించి మూసి కాలుష్య నిర్మూలణకు ప్రభుత్వం చేయనున్న చర్యలను వివరించనున్నారు. మూసీ నిర్వాసితులకు ఆయన భరోసా కల్పించనున్నారు. వారి ఇబ్బందులను కూడా స్వయంగా పాదయాత్ర ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించారు.
వలిగొండలో రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాల కంటే ముందే పాదయాత్ర నిర్వహించి బాధితుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు నిర్వాసితులకు చేయాల్సిన సహాయం పై ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మూసి బాధితులు కూడా పాదయాత్రలో పాల్గొని అవకాశం ఉంది.
MOST READ :
-
Runamafi : రుణమాఫీ కోసం అధికార పార్టీ ఎమ్మెల్సీ కమిషనర్, కలెక్టర్ కు వినతి..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!









