తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

సూర్యాపేట, మనసాక్షి

ప్రతి జాతరలో దుకాణాలు జాతర రోజులతో పాటు జాతర ముగిసిన తర్వాత మరో మూడు రోజులు మేము నడుపుకునే వాళ్ళమని ఈ ఏడాది జాతర ముగిసే ముందు రోజు నుంచే దుకాణాలు తీయమంటూ అధికారులు బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగుతూ దాడులు చేస్తున్నారని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో పలువురు దుకాణదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతరలో ప్రతిసారి తక్కువ ధరలకు దుకాణాల స్థలాలను కొనుగోలు చేసే వారమని ఈ ఏడాది దుకాణం స్థలం గజం 4200 నిర్ణయించగా ఒక్కరే పది తీసుకొని ఆ ధర కాస్త అమాంతం 8400కు పెంచి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.ఇది కాకుండా మూడు గజాల స్థలానికి డబ్బులు కడితే కేవలం రెండు గజాల స్థలం, 4 గజాల స్థలానికి డబ్బులు కడితే కేవలం మూడు గజాల స్థలాన్ని మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము దుకాణాలు నడిపితే పెట్టుబడులు రాకపోగా వేలం దారులకు మాత్రం లక్షల్లో లాభాలు వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా జాతర ముగిసే ముందు రోజు నుంచే అధికారులు దౌర్జన్యం చేస్తూ మాపై దాడులు చేస్తూ మేము ఇంకా ఎన్ని రోజులు డ్యూటీ చేయాలి మీరు దుకాణాలు బందు చేసుకొని పోవాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.

గురువారం రాత్రి ఓ గాజుల దుకాణం దారుడిని తీవ్రంగా కొట్టి జెసిబి తో దుకాణాలను తొక్కిస్తామని బెదిరింపులకు గురి చేశారని ఇలాంటి సంఘటనలు గత జాతరలో ఏనాడు లేవన్నారు. సాయంత్రం సమయంలో పట్టణవాసులు అధికంగా జాతరకు వస్తుండడంతో గిరాకీ బాగా అవుతుందని కానీ అధికారులు మాత్రం అత్యుత్సాహంతో సాయంత్రం వేళ దుకాణాలు బంద్ చేయించడంతో తాము ఈసారి వ్యాపారం ఎంతో నష్టపోయామన్నారు.

మా వ్యాపారాలు నడవకుండా మంచినీళ్లు రాకుండా చేయించడం, కరెంట్ కట్ చేయించడం జరిగిందన్నారు. మా నుంచి లక్షల్లో డబ్బులు చేతులు మారాయని మాకు మాత్రం చేసిన పనికి తగ్గ ప్రతిఫలం కూడా రాలేదని వాపోయారు. వేలం దారులు లక్షల్లో లాభాలు పొందితే తాము కష్టపడి లక్షల్లో నష్టపోయామని కలెక్టర్ సార్ స్పందించి మాకు తగిన న్యాయం చేసి సోమవారం వరకు దుకాణాలు నడుపుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా వేడుకున్నారు.

■ MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

  3. Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!

  4. BIG BREAKING : ఇరు వర్గాల ఘర్షణ టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్తు..!

  5. Suryapet : ముగిసిన గొల్లగట్టు జాతర..!

మరిన్ని వార్తలు