District collector : కలెక్టర్ హెచ్చరిక.. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

District collector : కలెక్టర్ హెచ్చరిక.. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
సూర్యాపేట, మన సాక్షి:
మూసి ఎగువ ప్రాంతం నుండి పెద్ద మొత్తంలో వరద వస్తున్నందున మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూసి ఎగువ నుండి 6500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, కాలువలు, గేట్లు, కలుపుకొని 6870 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉందని , మూసి ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 645 అడుగులకు గాను ప్రస్తుతం 643.77 అడుగులు ఉందని కలెక్టర్ తెలిపారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుండి సుమారు 26000 క్యూసెక్కుల నీరు కిందికి వదిలే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని మూసి నదికి శనివారం ఉదయం వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, అందువల్ల శుక్రవారం రాత్రి నుండే ప్రజలు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ప్రత్యేకించి పై నుండి ఎక్కువ మొత్తంలో నీటి ప్రవాహం వస్తే భీమారం లో లెవెల్ కాజ్ వే వద్ద రాకపోకలకు సమస్య ఏర్పడుతుందని, ఇబ్బందులు ఏర్పడతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరు ఈ లో లెవెల్ కాజ్ వేని దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన కోరారు.
అంతేకాక మూసీ నదిలోకి చేపలు పట్టేందుకు, బట్టలు ఉతికేందుకు, ఈత కొట్టేందుకు ఎవరు వెళ్లవద్దని, అంతేకాకలో లెవెల్ కాజ్ వే లు దాటడానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశం.. స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి..!
-
Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..! పేదలకు అన్ని రకాల వైద్య సేవలు..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక నో టెన్షన్..!









