Breaking Newsతెలంగాణరాజకీయం

BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!

BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!

హైదరాబాద్ , మన సాక్షి :

కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సిపిఎం ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి గురువారం మధ్యాహ్నం 3:00 లోగా పొత్తుల విషయమై తేల్చాలని డెడ్ లైన్ విధించింది. గడువు దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సిపిఎం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ALSO READ : 35 మందితో బిజెపి మూడవ జాబితా.!

హైదరాబాదులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ భట్టి విక్రమార్క ఫోన్ చేయడం వల్ల ఈరోజు మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ విధించామని చెప్పారు. అయితే ఇవాళ ఉదయం వరకు ఎదురు చూసామని.. అనివార్య కారణాలవల్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 17 అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తుందని వెల్లడించారు. సిపిఎం పోటీ చేసే స్థానాలు భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరువు, ముషీరాబాద్ నియోజకవర్గం ఆ పార్టీ కార్యదర్శి వెల్లడించారు.

ALSO READ : Scam in PACS : పిఎసిఎస్ లో కుంభకోణం.. రైతుకు తెలియకుండా సిబ్బంది రుణాలు..!

మరిన్ని వార్తలు