Nalgonda : ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు..!
Nalgonda : ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు..!
నల్లగొండ, మన సాక్షి :
ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపిదే విజయమని బిజెపి శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారము బీజేపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినా నిర్మల్ శాసన సభ సభ్యులు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని గుర్తుచేశారు.
బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి రెడ్డి అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతం ఆలపించిన తరువాత కార్యాశాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి యువ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆ అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయట పెట్టడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు..
కెసిఆర్ కుటుంబంలో కుటుంబ కుంపటి ఏర్పడిందని ఆ కుంపటి వైపు ప్రజలు వెళ్లొద్దని సూచించారు
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రభారి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్ , బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు,నూకల వెంకట్ నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి , సాదినేని శ్రీనివాసరావు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, మండల అధ్యక్షులు వివిధ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!
-
Liquor : స్పిరిట్ నింపి, లేబుల్స్ అంటించి.. ఈ ముఠా మామూలోళ్లు కాదు..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!
-
Nalgonda : ప్రభుత్వ ఉచిత పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!









