Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

GO 46 : జీవో 46 ను రద్దు పర్చాలి.. రూరల్ కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్..!

GO 46 : జీవో 46 ను రద్దు పర్చాలి.. రూరల్ కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జీవో నెంబర్ 46 కారణంగా రూరల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని…ఈ జీవోను రద్దు పర్చాలని రూరల్ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై కానిస్టేబుల్ అభ్యర్ధులు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ చేపట్టారు.

అనంతరం డీఎస్పీ ఆఫీస్ కు చేరుకొని డీఎస్పీ కి వినత్రి పత్రం అందజేశారు. అక్కడే తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ జీవో ప్రకారం హైదరాబాద్ జిల్లా వారికి 90 మార్కులు వచ్చిన జాబ్ కు అర్హత ఉంటుందని అదే మిగిలిన జిల్లాల్లో 130 మార్కుల రావాలన్నారు.

ALSO READ :

1. Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!

2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

3. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

2016, 2018 మాదిరిగానే కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టి గ్రామీణ పేద నిరుద్యోగులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఫయాజ్, రమేష్, దుర్గా, శివ, విజయ్, దేవ్ సింగ్, మహిందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు