Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

వినియోగదారుల్లో చైతన్యం కలిగించాలి..!

వినియోగదారుల్లో చైతన్యం కలిగించడానికి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి టి.వెంకటేష్ కోరారు.

వినియోగదారుల్లో చైతన్యం కలిగించాలి..!

నల్గొండ డిసిఎస్ఓ వెంకటేష్

నల్లగొండ, మన సాక్షి :

వినియోగదారుల్లో చైతన్యం కలిగించడానికి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి టి.వెంకటేష్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని డీసీఐసీ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ సమావేశం ఎన్.డి.సి.సి.సి. జిల్లా అధ్యక్షులు అన్నెబోయిన మట్టయ్య అధ్యక్షతన జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన డిసిఎస్ఓ టి.వెంకటేష్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు. తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా డ్రగ్ ఇన్ స్పెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను అభినందించారు. క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారుల సొసైటీలకు సంక్షేమ నిధి కోసం నీతి రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఎ.హిమగిరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు.

ఈ సమావేశంలో డిసిఐసి జిల్లా కన్వీనర్లు చింతమల్ల గురవయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కొడారి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.అస్మా, మహ్మద్ ముస్తఫా, జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దువ్వ గీత, మిర్యాలగూడ డివిజన్ కన్వీనర్ సిహెచ్. సాంబశివరావు, చండూరు డివిజన్ కన్వీనర్ గండూరి నర్సింహ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు జూలూరు వెంకటేశం, తాందారి యాదయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పోచం సోమయ్య, ప్రతినిధులు పి.కవిత, వి.వాణిశ్రీ, సీతారాములు, హరి, పాషా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు