తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లావ్యవసాయం

Corn Farmers : మొక్కజొన్న రైతుల పాదయాత్ర..!

Corn Farmers : మొక్కజొన్న రైతుల పాదయాత్ర..!

వెంకటాపురం, మన సాక్షి :

బహుళజాతి విదేశీ మొక్కజొన్న వ్యవసాయం చేసిన రైతులు దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిహేను రోజులుగా మొక్కజొన్న రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కంపెనీ ఆర్గనైజర్లు, ప్రభుత్వం స్పందించక పోవడం తో రైతులు గురువారం యోగితనగర్ నుండి పాదయాత్ర గా బయలు దేరి వెంకటాపురం చేరుకున్నారు.

ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ పాద యాత్ర ప్రధాన రహదారి మీదుగా సాగింది. వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ కి పలు డిమాండ్స్ కూడిన వినతిపత్రం అందించారు. సింజెంట, హై టెక్, మాన్సెంట, సీపీ వంటి విత్తన కంపెనీలను అడ్డుపెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

అధికార ప్రతిపక్ష పార్టీలను అడ్డుపెట్టుకొని బాండ్ వ్యవసాయం పేరుతో దారుణంగా మోసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కంపెనీ ఇచ్చిన ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ఎకరానికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయిందని రైతులు డిప్యూటీ తహసీల్దార్ ముందు వాపోయారు.ఎకరానికి లక్షా యాబై వేల రూపాయలు నష్టపరిహారం, టన్నుకు అరవై వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

మొక్కజొన్న పంటలో పనిచేసిన కూలీలు, రైతులు పక్షవాతం వచ్చి మంచం పట్టినారని వాళ్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కొంతమంది తెలియక పొట్టలు తింటే ఒళ్ళు నొప్పులు, వాపులు రావడం జరుగుతోందని, చొప్పటిని ఏడు దూడలు చిరుతపల్లి లో చనిపోయినట్టు తెలిపారు. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని అన్నారు.

ఈ పాదయాత్రకు గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొర్స నర్సింహా మూర్తి రైతుల పక్షాన పోరాటం చేయడం అభినదనీయం అన్నారు. సమస్య పరిస్కారం కాకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

రైతులకు న్యాయం చేయాలన్నారు. నాయకులు, జి ఎస్పీ జిల్లా కార్యనిర్వాహన అధ్యక్షులు పూనెం ప్రతాప్,కుంజ మహేష్, మొడెం నాగరాజు, కంతి వెంకట్, వాజేడు వెంకటాపురం మండలాల రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : దళారుల నుండి సమస్యలు ఉన్నాయా.. పసుపు రైతులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!

  2. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  5. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు