Nalgonda : నల్గొండ జిల్లాలో పత్తి మూటలతో రోడ్డెక్కిన పత్తి రైతులు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో పత్తి మూటలతో రోడ్డెక్కిన పత్తి రైతులు..!
గుర్రంపోడు, మన సాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం, కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ-దేవరకొండ రహదారిపై రైతులు ఎడ్ల బండ్లతో తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోకో నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనతో నల్గొండ-దేవరకొండ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.సీసీఐ కొనుగోలు కేంద్రాలలో సమస్యల కారణంగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు (మద్దతు ధర కంటే చాలా తక్కువ) అమ్ముకోవలసి వస్తుందని ఆవేదనవ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఎలాగైనా అధికారులు పత్తి కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుల డిమాండ్ చేశారు.అధికారుల హామీతో రైతులు తమ ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
MOST READ :
-
Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
Miryalaguda : మిల్లుల, ఇటుక బట్టీల కాలుష్యం నివారించాలి..!










