DSP : రౌడీషీటర్లకు కౌన్సిలింగ్.. అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు..!
DSP : రౌడీషీటర్లకు కౌన్సిలింగ్.. అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు..!
తొర్రూర్, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు డీఎస్పీ శ్రీ కృష్ణ కిషోర్ గారు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యల భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
గత కొంతకాలంగా మంచి ప్రవర్తనతో, ఎటువంటి క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న వ్యక్తులను పరిశీలించిన అనంతరం, గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో వారి పై ఉన్న షీట్లు తొలగించబడ్డాయి.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, “ఎటువంటి చట్టవిరుద్ధ చర్యల్లో పాల్గొనకుండా, చక్కని ప్రవర్తన చూపిస్తున్నవారి కేసులను సమీక్షించి అవసరమైతే షీట్లను తొలగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత. అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో తొర్రూర్ సీఐ శ్రీ టీ. గణేష్, సర్కిల్ ఎస్సైలు జి. ఉపేందర్, ch.రమేష్ బాబు, పి. రాజు మరియు సురేష్ పాల్గొన్నారు.
MOST READ :









