Local Body Elections : తొలి దశ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం..!

Local Body Elections : తొలి దశ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం..!
కరీంనగర్, మనసాక్షిv:
కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 05 మండలాల్లోని కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధంపూర్, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, చామనపల్లి, ఫకీర్ పేట్, జూబ్లీ, నగునూరు పలు పోలింగ్ కేంద్రాలను గురువారం సందర్శిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సీపీ సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సీపీ ఈ సందర్బంగా తెలిపారు.









