తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!

Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!

సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:

ప్రాణాలకు తెగించి తాటి చెట్టుపై తల కిందులుగా వేలాడుతున్న ఒక గీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కొండూరు పెద్ద చంద్రయ్య వయసు (60) రోజు వారి లాగే గీత పనిమీద ఉదయం 9 గంటల ప్రాంతాన తాటి చెట్టు ఎక్కాడు.

ప్రమాదవశాత్తు మోకు పట్టు తప్పడంతో తల కిందులుగా అక్కడే చెట్టుకు వేలాడాడు. అదే సమయంలో అక్కడకు దగ్గరలో ఉన్న తోటి గౌడన్నలు బాధితుని శబ్దాలను గ్రహించి అక్కడికి వెళ్లారు. తాటి చెట్టుపై కిందికి వేలాడుతున్న చంద్రయ్యను చూసి తోటి గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కి గంటన్నర సేపు శ్రమించి చంద్రయ్యను సురక్షితంగా కిందకు దింపారు.

ప్రాణాలకు తెగించి తోటి కార్మికుడిని కాపాడిన తొర్పునూరి ఇస్తారి,కొండూరు యాదయ్య,కందుల లింగయ్య, నాతి కృష్ణయ్య, కొండూరి కృష్ణయ్య లను గ్రామస్తులు అభినందించారు.

MOST READ :

CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)

Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

Karimnagar : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు కరీంనగర్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!

Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు దరఖాస్తులు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు