Accident : రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు..!

Accident : రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు..!
వెల్దండ, మన సాక్షి :
వెల్దండ మండలంలోని చెర్కూరు గేటు సమీపంలో హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డీసీఎం ఢీకొన్న సంఘటనలో బాలిక (13) అక్కడికక్కడే మృతి చెందింది.
తండ్రి మరో కూతురు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు అంబులెన్స్ లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వంగూరు మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన సురేష్ యాదవ్ హైదరాబాద్ నుండి నర్సంపల్లి గ్రామానికి బైక్ పై వెళుతుండగా చెరుకూరు -పెద్దపూర్ సమీపంలో డీసీఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కూతురు అక్కడికక్కడే మరణించింది . ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయంలో హైదరాబాద్ కు వెలుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
MOST READ :
-
Amangal : ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు కూల్చివేత..!
-
Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
-
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలి..!









