Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!

Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిరుమర్రి కృష్ణయ్య, పొదిల్ల శ్రీనివాస్, ముదిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొని రాజీవ్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి రాజీవ్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో బాణా సంచాలు కాల్చి విజయోత్సవ వేడుకలు జరిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరినై కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం..

అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్నలను పొందుతుందన్నారు. ఫలితంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ కూడా దక్కవని తెలియజేసినారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో, వార్డుల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ప్రజల్లో మమేకమై స్థానిక సంస్థల ఎన్నికల్లో
గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు నాగు నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య గౌడ్ , సలీం ఆరిఫ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, బెజ్జం సాయి, ఉబ్బ పెళ్లి కాశయ్య, రమేష్ నాయక్, బూడిద సైదులు, సిద్దు నాయక్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు..!

  2. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

  3. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలును సవ్యంగా పూర్తి చేయాలి..!

  4. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

మరిన్ని వార్తలు