Nalgonda : ఓటమి విజయానికి నాంది కావాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
Nalgonda : ఓటమి విజయానికి నాంది కావాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి :
క్రీడలలో ఓటమి విజయానికి నాంది కావాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జరుగుతున్న కెవిఆర్ కప్ సీజన్ -1 క్రికెట్ పోటీలలో ఆదివారం ముగిసాయి. ఈ సందర్భంగా ముగింపు వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ రెడ్డిలతో కలిసి క్రికెట్ విజేత జట్లకు షీల్డ్, నగదు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు, యువతకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దేశంలో ప్రతిష్టాత్మకంగా గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కె.వి.ఆర్ కప్ సీజన్-1 క్రికెట్ ఆర్గనైజర్స్ నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి టీంను మంత్రి అభినందించారు. కెవిఆర్ కప్ సీజన్-1 విజేతగా నిలిచిన ఎన్ కె ఎన్జట్టుకు షీల్డ్, రూ. 1,00116 నగదు బహుమతి, ద్వితీయ శ్రేణిలో నిలిచిన స్టార్ 11 జట్టుకు షీల్డ్, రూ. 50,116,
తృతీయ శ్రేణిలో నిలిచిన కే ఏ ఆర్ యుజట్టుకు షీల్డ్, రూ. 30,000, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు షీల్డ్, రూ. 20,000 నగదును అందజేశారు.
అదేవిధంగా విజేతగా నిలిచిన ప్రథమ,ద్వితీయ జట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యక్తిగతంగా కూడా నగదు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బోల్ల వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, టిపిసిసి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దుబ్బ రూప అశోక్ సుందర్,
పానగల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఇంతియాజ్ హుస్సేన్, కెవిఆర్ కప్ సీజన్-1 క్రికెట్ ఆర్గనైజర్స్ నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి, పుట్టా రాకేష్,దొంగరి నరేందర్ యాదవ్,గుండగోని సాయి, ఉమర్ షరీఫ్, నల్లగొండ అశోక్,సుధాకర్ రావు,శివ, అజయ్, పలువురు కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Additional collector : కొత్త పథకాల ఎంపికకు ఇవీ మార్గదర్శకాలు.. అదనపు కలెక్టర్..!
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!










