Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరి బాధ్యత.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా అరివ్ ఆలివ్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు డిఫెన్స్ డ్రైవింగ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరి బాధ్యత.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా అరివ్ ఆలివ్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు డిఫెన్స్ డ్రైవింగ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డిఫెన్స్ డ్రైవింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వేగ పరిమితులను అతిక్రమించకూడదని, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నిషేధమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలి అని సూచించారు.

సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, అప్రమత్తత కోల్పోతే ప్రాణాపాయం సంభవించవచ్చని పేర్కొన్నారు. ప్రతి వాహనదారులు తప్పకుండా వాహనాలకు సంబంధించిన పత్రాలు ఆర్సి, లైసెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

ప్రత్యేకంగా మెడికల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు రేపటి వైద్యులు కాబట్టి సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే బాధ్యత మీపై ఉంటుందని, అందుకే ముందుగా మీరు సురక్షితంగా ఉండటం అత్యవసరమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ఎస్పీ వివరించారు. కుటుంబంలో ఒక వ్యక్తి లేదా కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని, ప్రమాదాలలో అంగవైకల్ ఏర్పడితే జీవితాంతం దుర్భరమైన జీవితం గడపవలసి వస్తుందని కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని అవగాహన కల్పించారు.

డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ఇతరుల తప్పిదాలను కూడా ముందుగా ఊహించి జాగ్రత్తగా వాహనం నడపడం అని స్పష్టం చేశారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ శివశంకర్, కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ సింగ్, లెక్చరర్లు, ఎస్సై రాముడు, వెంకటేశ్వర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు