Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!
గోదావరిఖని, మన సాక్షి:
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితుని వివరాలు వెల్లడించారు. స్థానికంగా డిగ్రీ చదువుతున్న కవ్వంపల్లి అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాడు. చెడు అలవాట్లకు బానిసగా మారి జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించవచ్చని దొంగతనాలు చేస్తున్నాడు. వన్టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐలు, క్రైమ్ పార్టీ సిబ్బందితో తీముల్గా ఏర్పడి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఫైవ్ ఇంక్లైన్ ప్రాంతంలో అనుమానా స్పదంగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సీఐ సిబ్బందితో కలిసి నిందితుడి ని అదుపులో కి తీసుకున్నారు. నిందితుడి నుండి 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
MOST READ :









