Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి..!

Nalgonda : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి..!

నల్లగొండ, మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీహార్ కార్మికులు మృతి చెందినట్లు నల్గొండ రూరల్ ఎస్సై మానస తెలిపారు. ఆమె తెలియజేసిన వివరాలు ప్రకారం.. నల్లగొండ.. పానగల్ బైపాస్ లో ఉన్న దత్త సాయి కాలనీలో ఒక వెంచర్లో సైట్ ఇంజనీర్ ఐదుగురు కార్మికులు వాటర్ ట్యాంక్ పనులు చేస్తూ పక్కనే ఉన్న షెడ్డులో నివసిస్తున్నారు.

ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి తన్మై, బాపన్ సర్దార్ అనే ఇద్దరు కార్మికులు హీరో హోండా బైక్ పై వెంచర్ నుండి బయటకు వెళ్లి తిరిగి మిర్యాలగూడ రోడ్డు వైపు నుండి వెంచర్ కు వస్తుండగా బైకు అదుపుతప్పి డివైడర్ కు తగలడంతో బైక్ను నడుపుతున్న తన్మైతలకు బలమైన రక్తదాయమై అక్కడికక్కడే మరణించగా, వెనుక కూర్చున్న బాపన సర్దార్ ఎగిరి రోడ్డుపై పడగా వెనుక నుండి వస్తున్న గుర్తుతెలియని వాహనము బాపన్ సర్దార్ కాళ్లపై నుండి వెళ్లింది.

ప్రమాదకర పరిస్థితిలో ఉండగా 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సర్దార్ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. భూక్య నాగేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ : 

  1. Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

  2. Kiledi : వారు మహా కిలేడీ లు..!

  3.  District collector: కుక్కల దత్తతకు భారీ స్పందన..! 

  4. Tasildar : ఉద్యోగిని పై లైంగిక వేధింపులు.. తహసిల్దార్ అరెస్ట్..!

  5. Land : భూములు కొంటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

మరిన్ని వార్తలు