Suryapet : సూర్యాపేట జిల్లాలో దంపతుల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..!
సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భార్య భర్తల జంట హత్యల కేసుకు సంబంధించి బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. హత్యకు పాల్పడ్డ వారిని 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశాం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో దంపతుల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..!
సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు, ఇద్దరు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భార్య భర్తల జంట హత్యల కేసుకు సంబంధించి బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. హత్యకు పాల్పడ్డ వారిని 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశాం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు, అరెస్ట్ వివరాలను ఎస్పీ వివరించారు.
మోతే మండల కేంద్రం జాతీయ రహదారి పక్కన మృతిదేహాలను పాక్షికంగా పూడ్చిపెట్టారు అని గురువారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సీఐ రామ కృష్ణ రెడ్డి, స్థానిక ఎస్ఐ లచ్చి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక గ్రామ అధికారితో కలిసి మృతి దేహాలను వెలికి తీసి గుర్తించడం జరిగినదని అన్నారు ఎస్పీ నరసింహ సంఘటన స్థలానికి చేసుకుని పరిశీలించారు.
డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, CI రామకృష్ణా రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా రెండవ నిందితుడైన జిల్లేపల్లి సుందర్ మృతిచెందిన బూబా ను తీసుకెళుతూ అనామస్పదంగా కనిపించాడు.
దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్న మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం శుక్రవారం ఉదయం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద మొదటి నిందితుడు షరీఫ్ ను, రెండవ నిందితుడు సుందర్ అను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగినదని,విచారించగా నేరాన్ని అంగీకరించారు. మోతే గ్రామానికి చెందిన సుందర్, పోలీసు స్టేషన్ కు వచ్చే పంచాయతీలు చేస్తూ మొదటి నిందితుడు షరీఫ్ కుంపరిచయం అయ్యాడు.
సుందర్ ద్వారా హత్యకు గురైన నాగులు, బూబా భార్యాభర్తలు షరీఫ్ కు పరిచయం అయ్యారు. ఈ పరిచయం సాన్నిహిత్యం ఏర్పడినది. భూబా,నాగులు దంపతులకు షెరీఫ్ 3 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఈ డబ్బులు అడిగే క్రమంలో భూబా, నాగులు దంపతులు షరీఫ్ ను బెదిరించగా వీరి అడ్డు తప్పించుకోవాలని పథకం పన్ని రెండవ నిందితుడు సుందర్ సహాయం తో హత్య చేసి పాతి పెట్టాడు ని తెలిపారు.
నిందితుల గుర్తింపు మరియు అరెస్ట్ దర్యాప్తు లో భాగంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా, సాంకేతిక ఆధారాలు (టెక్నికల్ ఎవిడెన్స్ ), సీసీటీవీ ఫుటేజ్ మరియు స్థానికుల సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి సూర్యాపేట కొత్తగా బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు.
దర్యాప్తు లో పారధర్శకత కోసం కేసు ను సూర్యాపేట్ డిఎస్‌పి, శ్రీ ప్రసన్న కుమార్ కి అప్పగించగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎండి షరీఫ్ (పోలీస్ కానిస్టేబుల్, మోతే పి.యస్ ) మరియు జిల్లేపల్లి సుందర్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గుద బండ, నేరస్తుడు ఏ-1 యొక్క బైక్ , రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నేరాన్ని అంగీకరించడం జరిగింది. వారిని రిమాండ్‌కు తరలించటం జరుగుతుందన్నారు.
ఈ కేసులో బాగా పని చేసిన కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, అధికారి సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, స్థానిక ఎస్సై లచ్చిరెడ్డి, సిసిఎస్ ఎస్ఐలు సాయిరాం, హరికృష్ణ, ccs సిబ్బంది బాగా పనిచేశారు అందరికీ రివాడ్స్ అందించి అభినందించారు.
ఇవి కూడా చదవండి 👇
- District Collector : పోలీస్ పరేడ్ మైదానం పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక..!
- Free Insurence : రూ.5 లక్షల ఉచిత ప్రభుత్వ ఇన్సూరెన్స్.. ఇంట్లో ఉండే కార్డు పొందొచ్చు..!
- శ్రీశైలంలోకి నిలకడగా వరద, నాగార్జున సాగర్ లోకి 76,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!
- Cheyutha : చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెలాఖరే చివరి తేదీ..!










