Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

మహాత్ముడి ఆశయాలే.. నేటి తరానికి స్ఫూర్తి

సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి అన్నారు.

మహాత్ముడి ఆశయాలే.. నేటి తరానికి స్ఫూర్తి

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి.

ఇబ్రహీంపట్నం, మన సాక్షి ప్రతినిధి :

సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో గాంధీజీ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పింపించిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి.బిఆర్ఏస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వల్ వెంకట రెడ్డి.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన అహింసా పోరాటాన్ని, ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.మహాత్మా గాంధీ ప్రజల్లో ఐక్యత, సోదరభావం, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. ఎలాంటి ఆయుధాలు లేకుండానే సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసిన మహనీయుడిగా గాంధీజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు