Cheyutha : చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెలాఖరే చివరి తేదీ..!
చేయూత పింఛన్ల మంజూరుకు అర్హులైన ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Cheyutha : చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెలాఖరే చివరి తేదీ..!
కంగ్టి, మన సాక్షి:-
చేయూత పింఛన్ల మంజూరుకు అర్హులైన ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంగ్టి ఎంపీడీవో దయాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తుల స్వీకరణపై తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు.
అర్హులైన వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల మంజూరుకు అవసరమైన ధ్రువపత్రాలతో పంచాయతీ కార్యాలయాలు లేదా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. నూతన వృద్ధ్యాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదన్నారు.
పెన్షన్ల కోసం కావాల్సిన పత్రాలు :
వితంతువులు భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి,భర్తతో విడిపోయిన, విడాకులు పొందిన వారు కనీసం ఏడాదిగా విడిగా ఉంటున్నట్లు తహశీల్దార్ విచారణ నివేదిక ఇవ్వాలి,వివాహం కాని మహిళలకు 30-35ఏళ్లు ఉండాలి, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లో 40శాతం పైగా వైకల్యం ఉండాలి,50ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం, సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.









