Amangal : ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు కూల్చివేత..!

Amangal : ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు కూల్చివేత..!
ఆమనగల్లు, మనసాక్షి :
ఆమనగల్లు మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామ శివారులోని గ్రామానికి చెందిన పర్వతాలు, శ్రీశైలం లు అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్ బెడ్లను రెవెన్యూ పోలీసు అధికారులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించి కూల్చి వేసినట్లు ఆమనగల్లు ఎస్సై బి.వెంకటేష్ తెలిపారు.
వ్యవసాయ పొలాల్లోంచి మట్టిని తరలిస్తూ అక్రమంగా ఇసుక ఫిల్టర్ల ద్వారా కృత్తిమ ఇసుకను తయారు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు రెవెన్యూ పోలీసు అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా స్థానిక ఎస్సై బి వెంకటేష్ మాట్లాడుతూఫిల్టర్ ఇసుక తయారీ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఇసుకను తయారి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ కృతిమ ఇసుక తయారికి పాల్పడుతున్న పర్వతాలు శ్రీశైలం లను అరెస్టు చేసి బైండోవర్ చేయనున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
MOST READ :
-
ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!
-
Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
-
Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. వారికి రూ.లక్ష డొనేషన్..!









