Dammapeta : దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి ముంచెత్తిన వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

Dammapeta : దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి ముంచెత్తిన వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
దమ్మపేట, మనసాక్షి :
అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. అందరూ నిద్రిస్తుండగా వచ్చిన వాన లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. భారీ వర్షపాతం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి పోయి, ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. మందలపల్లి, అప్పకుంట చెరువు అలుగు నీటిలో దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి మీద నీరు ముంచెత్తి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. నెమలిపేట గ్రామంలో కాలువ పొంగిపొర్లి పలు ఇళ్లలోకి నీరు చేరింది. అప్పారావుపేట పామాయిల్ కర్మాగారం వైపు నుండి వచ్చే వరద నీటితో అప్పారావుపేట హరిజనవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
నిద్రిస్తున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరుగుతుంది, ఇళ్లలోకి ఇంత వర్షం నీరు ఎక్కడి నుంచి వచ్చిందని తేరుకునే లోపే కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరంతా వచ్చి చేరింది. రాత్రంతా ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
MOST READ :
-
Urea : రైతులకు టోకెన్లు.. యూరియా పక్క దారి..!
-
Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!
-
Health : ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయం.. ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
Heavy Rain : నిండు గర్భిణి మహిళకి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో ఒడ్డు దాటింపు..!









