Breaking Newsతెలంగాణ

TG News : ధరణి పోర్టల్ సేవలు బంద్..!

TG News : ధరణి పోర్టల్ సేవలు బంద్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు బంద్ అయ్యాయి. అందుకు సంబంధించిన డేటా బేస్ వెర్షన్ అప్ గ్రేడ్ అవుతుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన ఈ అప్గ్రేడేషన్ సోమవారం (డిసెంబర్ 16)వ తేదీ వరకు జరగనున్నది.

దాంతో ఈ నాలుగు రోజులపాటు ధరణి సేవలు బంద్ అయ్యాయి. అప్ గ్రేడ్ పూర్తయిన తర్వాత మళ్లీ ఈ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకువచ్చింది. అయితే ధరణి లో బీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ధరణి పోర్టల్ లో మార్పులు చేస్తున్నారు.

అదేవిధంగా గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు అన్నింటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేస్తుంది. అందుకుగాను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లు పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు