Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..!

Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..!
దామరచర్ల, మనసాక్షి :
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు అరాచక పాలన చేస్తున్నారని మాజీ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దామరచర్ల మండల పరిధిలోని కొత్తపేట తండాలో యూరియా కోసం ధర్నాలు పాల్గొన్నందుకు సాయి సిద్దు అనే గిరిజన యువకుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని అతడు లేవలేని స్థితిలో ఉన్నాడని యూరియా అడిగితే ఇంతలా కొడతారా అని ఇది ఎక్కడి న్యాయం అని అన్నారు.
యూరియా అందించలేని చేతకాని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు పోలీసులతో ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మధ్యకాలంలోనే యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాటలో ఒక గిరిజన మహిళ మృతి చెందిందని అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రాలేదన్నారు.
సాయి సిద్దు పై దాడి దిగిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు సిద్ధార్థ, నోముల భగత్, దుర్గమ్మపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలాజీ నాయక్, ఆంగోతు హాథిరాం, కుందూరు వీర కోటిరెడ్డి, లింగా నాయక్ పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..! పేదలకు అన్ని రకాల వైద్య సేవలు..!
-
Time Management : 24 గంటలు సరిపోవడం లేదా.. సమయాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోండి..!
-
Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Trump : H1B వీసా అంటే ఏమిటి.. ఎవరికి వస్తుంది.. ట్రంప్ సంచలన నిర్ణయం..!










