క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Dial 100 : ప్రాణాలు కాపాడిన డయల్ 100..!

Dial 100 : ప్రాణాలు కాపాడిన డయల్ 100..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

డయల్ 100 కాల్ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడింది. సరైన సమయానికి పోలీసులు అక్కడికి చేరుకొని నిండు ప్రాణాన్ని కాపాడారు.

నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ గొండ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

రాజు మద్యం మత్తులో ఉండి పురుగుల మందు డబ్బాలతో గ్రామ శివారులోని ఒక గుట్ట పైకి వెళ్లి భార్య మాధవి కి కాల్ చేసి నేను పురుగుల మందు తాగి చనిపోతున్నానని చెప్పాడు కంగారు.

పడిన భార్య వెంటనే డయల్ 100 కాల్ చేయగా రూరల్ డయల్ 100 పోలీసులు ఏఎస్ఐ బాలయ్య, కానిస్టేబుల్ ఆనంద్ వెంటనే అప్రమత్తమై నూతన సాంకేతిక వ్యవస్థ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకొని రాజును గుర్తించి కాపాడారు.

గ్రామ పెద్దలు, అతని భార్య మాధవి లకు అప్పగించి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రాజు ప్రాణాలు కాపాడినందుకు గ్రామస్తులు, భార్య మాధవి పోలీసులకు కృతజ్ఞత తెలిపారు.

ALSO READ : 

Nagarjunasagar : జన సముద్రమైన సాగర్.. సందర్శకుల నిరాశ..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

CEIR : ఫోన్ పోయినా దొరికే టెక్నాలజీ.. సీఈఐఆర్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!

మరిన్ని వార్తలు