ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

SI : రామసముద్రం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్.. ఎవరో తెలుసా..!

SI : రామసముద్రం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్.. ఎవరో తెలుసా..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల నూతన ఎస్సైగా ఆదివారం దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.పోలీస్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. పోలీస్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈయన ఇంతకుముందు తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. రామసముద్రం ఎస్సైగా విధులు నిర్వహించిన రమేష్ బాబు రాయచోటి సైబర్ క్రైమ్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.

అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమమద్యం, ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక ద్రుష్టి సాధిస్తామన్నారు. కర్ణాటక మద్యం అరికట్టడానికి మా సిబ్బంది తో కలిసి గస్తీ నిర్వహిస్తామన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యాదులకు సమన్వయం అందిస్తానన్నారు. ఏళ్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని మీ సమస్యలు నెరవేరుస్తానన్నారు.

ఎక్కడైన చట్ట వ్యతిరేక పనులు చేపడుతున్నారని తెలిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో అల్లరి మూకలవికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన ఎస్సై కి ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీస్ సి బ్బంది, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  2. CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

  3. Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!

  4. Local Elections : ఓటర్ల ఆకర్షణ కోసం తప్పని తిప్పలు.. స్థానిక పోరులో ఎల్ఈడి స్క్రీన్..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు