Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

టికెట్లు ఆశించిన వాళ్ళు తిరుగుబావుటా..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వందమందికి సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 119 స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు విడతల్లో 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలివిడత జాబితాలో కొంతమేరకు అసమతి రాగం వినిపించినా.. రెండవ విడత 45 మందికి స్థానాలు కేటాయించడంతో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి.

100 స్థానాలలో వివిధ పార్టీల నుంచి చేరిన వారికి 28 మందికి పార్టీ టికెట్లు కేటాయించారు. కాగా ఎప్పటినుంచో నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఉన్న నాయకులు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. అసమతితో కార్యకర్తల సమావేశాలు నిర్వహించుతూ తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

♦️ పాలేరు ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానం కేటాయించింది. కాగా నియోజకవర్గం లో మాధవి రెడ్డి టికెట్ ఆశించి వంగపడటం వల్ల ఆమె విలపిస్తూ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

♦️ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పిజెఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ బంగపాటు కలిగింది. జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ కు కేటాయించగా విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు. ఆ కుటుంబంలో విజయా రెడ్డికి టికెట్ కేటాయించడం వల్ల విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయించలేదని సమాచారం. దాంతో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులతో ఆదివారం సమావేశం కానున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

♦️ జడ్చర్ల నియోజకవర్గం లో టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు.

ALSO READ : BIG BREAKING : బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక వాల్ పోస్టర్లు..!

♦️ మునుగోడు నియోజకవర్గం లో చల్లమల్ల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడు. కానీ అనుకోకుండా ఇటీవల పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల చలమల్ల కృష్ణారెడ్డి బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

♦️ వరంగల్ పశ్చిమ టిక్కెట్ ఆశించి బంగపడిన జంగా రాఘవరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలోనే కంటనీరు పెట్టుకున్నారు. కార్యకర్తలు నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు.

ALSO READ : KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!

♦️ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి బంగపడిన ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం లో సుభాష్ రెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట టికెట్ మదన్మోహన్ రావు కు అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో కార్యకర్తలతో సమావేశమైన సుభాష్ రెడ్డి రాజీనామా యోజనలో ఉన్నారు.

♦️ కూకట్ పల్లిలో పార్టీ విభేదాలు బహిర్గతమయ్యాయి. కూకట్ పల్లిలో పార్టీ టికెట్ ఆశించి బంగపడిన నేత గొట్టిముక్కల వెంగళరావు. పార్టీ విడాలంటే బాధగా ఉందంటూ కంటనీరు పెట్టుకున్నారు. కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు