Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రెండు విడతల్లో 100 మంది అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 55 మందికి, రెండవ జాబితాలో 45 మందికి సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా కొన్ని స్థానాల్లో టికెట్లు రాని వాళ్ళు నిరుత్సాహం గురై ఆందోళనలు చేయడంతో పాటు పార్టీలు సైతం వీడారు. కాగా మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

దానిలో నాలుగు స్థానాలను వామపక్ష పార్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కాగా మరో 15 స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తారని విషయంపై కీలకంగా మారింది. ఇప్పుడు ఆ 19 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి కీలకం కానున్నాయి. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఆ 19 స్థానాల్లో అభ్యర్థుల కేటాయింపు పరీక్షగా మారనున్నది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఆశావహులను బుజ్జగించిన అనంతరమే టికెట్లు ఫైనల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ALSO READ : Congress Second List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. ఇవి పేర్లు..!

వామపక్షాలకు కేటాయించే సీట్లు :

చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు సిపిఐ కి, మిర్యాలగూడ, వైరా స్థానాలను సిపిఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తం తో ఇస్తుంది..!
15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీ :

1. సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి / పటేల్ రమేష్ రెడ్డి
2. తుంగతుర్తి – అద్దంకి దయాకర్ / వడ్డేపల్లి రవి / మోత్కు పల్లి నరసింహులు
3. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ / మహేష్ కుమార్ /
షబ్బీర్ అలీ
4. బాన్సువాడ – కాసుల బాలరాజు / ఏనుగు రవీందర్ రెడ్డి
5. జుక్కల్ – గంగారాం / లక్ష్మీకాంతరావు
6. పటాన్ చెరువు – మధు / శ్రీనివాస్ గౌడ్
7. కరీంనగర్ – సంతోష్ కుమార్ / పురుమల్ల శ్రీనివాస్
8. ఇల్లందు – కోరం కనకయ్య / శంకర్ నాయక్
9. డోర్నకల్ – రామచంద్రనాయక్
10. సత్తుపల్లి – రాగమయి / మానవతారాయ్
11. నారాయణఖేడ్ సురేష్ షట్కర్ / సంజీవరెడ్డి
12. అశ్వరావుపేట – తాటి వెంకటేశ్వర్లు / ఆదినారాయణ
13. చార్మినార్ – అలీ మస్కతి
14. సిరిసిల్ల- ఉత్తంకుమార్ రెడ్డి , మాజీ పీసీసీ అధ్యక్షులు
15. కామారెడ్డి – రేవంత్ రెడ్డి , పిసిసి అధ్యక్షులు.
పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ALSO READ : KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!

మరిన్ని వార్తలు