డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తం తో ఇస్తుంది..!

డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తం తో ఇస్తుంది..!

హైదరాబాద్, మన సాక్షి :

డ్రామాలు ఆపి నవంబర్ 2వ తేదీ లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని.. లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పెంచిన మొత్తం తో కలిపి ఇస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు బంధు, దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం కు లేఖ రాశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ALSO READ : KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!

దాంతో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికల కమిషన్ కు తాము రాసిన లేక సారాంశాన్ని వివరించారు. నవంబర్ 2వ తేదీ లోపు రైతులపై ప్రేమ ఉంటే రైతుబంధు డబ్బులు ఇవ్వు.. లేకుంటే మీ డ్రామాలు ఆపు అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రా మారావు. రైతులు ఉద్యోగులు, వృద్ధులపై ప్రేమ ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు నిధులు విడుదల చేయి… అంటూ ఘాటుక స్పందించారు.