Good News : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. నేడు జాబ్ మేళా..!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉమ్మడి జిల్లా స్థాయిలో జాబ్ మేళా నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి . హెచ్. ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Good News : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. నేడు జాబ్ మేళా..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉమ్మడి జిల్లా స్థాయిలో జాబ్ మేళా నిర్వ హిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి . హెచ్. ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న(నేడు) ఉదయం 9:00 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారా మంలో జాబ్ మేళా నిర్వహిం చడం జరుగుతుందని తెలిపారు.
ఈ మేళాలో నారా యణపేట జిల్లా యువతతో పాటు మహబూబ్నగర్, గద్వాల నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ప్రభుత్వం 6 మార్చి 2026 నుండి 12 జూన్ 2026 వరకు నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచ రణ ద్వారా గ్రామీణ స్థాయి లో అవగాహన పెంపొందిం చడం, యువజన, క్రీడా అంశాల అమలును బలోపే తం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు.
ఈ కార్య క్రమంలో భాగంగా మే 18 నుండి 23 వరకు యువజన, క్రీడలపై అవగాహన కల్పిస్తూ వారోత్సవాలు నిర్వహించబడ
తాయన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆయా ఉద్యో గాలకు ఎంపికైన అభ్యర్థు లకు మే 23న నియామక పత్రాలు అందజేయ
బడతాయన్నారు. అర్హత కలిగిన జిల్లా యువత ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు చదవండి :
- Nalgonda : ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆహత్యాయత్నం.. కన్నీరు తెప్పిస్తున్న సెల్ఫీ వీడియో..!
- SSC : పది లో మాతృశ్రీ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత..!
- Miryalaguda : జల్సాలకు అలవాటు పడి కారు రిపేరుకు డబ్బుల్లేక దొంగతనం..!
- Miryalaguda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక ప్రకటన.. మిర్యాలగూడను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతాం..!









