Nalgonda : ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆహత్యాయత్నం.. కన్నీరు తెప్పిస్తున్న సెల్ఫీ వీడియో..!
నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ కేంద్రంలో ఇన్ఛార్జ్‌గా పనిచేస్తున్న కొప్పుల సైదులు, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Nalgonda : ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆహత్యాయత్నం.. కన్నీరు తెప్పిస్తున్న సెల్ఫీ వీడియో..!
కనగల్, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ కేంద్రంలో ఇన్ఛార్జ్‌గా పనిచేస్తున్న కొప్పుల సైదులు, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు సైదులు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. “ఒకవైపు రైస్ మిల్లర్ల వేధింపులు, మరోవైపు ధాన్యం విక్రయించలేక రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి మధ్య నలిగిపోతున్నాను. నా ఆత్మహత్యతోనైనా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో కొనుగోలు కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల అరాచకాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ల వేధింపుల నుంచి ఐకేపీ సిబ్బందిని, రైతులను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.