Miryalaguda : జల్సాలకు అలవాటు పడి కారు రిపేరుకు డబ్బుల్లేక దొంగతనం..!
అద్దెకు తీసుకున్న కారు రిపేరుకు డబ్బు లేక బంగారం గొలుసు చోరీ చేసిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. సీసీ కెమెరాల పూటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Miryalaguda : జల్సాలకు అలవాటు పడి కారు రిపేరుకు డబ్బుల్లేక దొంగతనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అద్దెకు తీసుకున్న కారు రిపేరుకు డబ్బు లేక బంగారం గొలుసు చోరీ చేసిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. సీసీ కెమెరాల పూటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన నర్సింహారావు కుమారుడు గోపీచంద్ కొద్ది నెలలుగా పట్టణంలోని బాపూజీ నగర్ లో ఉంటూ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. వాటర్ ప్లాంట్ లో ఆటో నడుపుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.
అయితే గోపీచంద్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకోగా అది రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్నది. కాగా కారును రిపేరు చేయించేందుకు అద్దకు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో డబ్బులు లేక దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఈ నెల 27వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో సాంప్రదాయ హోటల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గౌరు వజ్రమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా సిఐ నాగభూషణరావు, ఎస్సై సైదిరెడ్డి నేతృత్వంలో సీసీ కెమెరాల పూటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు.
MOST READ :
- Miryalaguda : మిర్యాలగూడలో కారు బీభత్సం.. ఘోర ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..!
- Breaking : మిర్యాలగూడలో వృద్ధురాలిపై దాడి.. బంగారం చోరీ.. సిసి టీవీ వీడియో..!
- Suryapet : సూర్యాపేట జిల్లా కోర్టు సంచలనం.. హత్య కేసులో మహిళకు జీవితఖైదీ శిక్ష..!
- గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్రంపోడు క్రీడాకారుల జోరు..!









