Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో కారు బీభత్సం.. ఘోర ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. ఒకరు మృతిచెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై నందిపాడు చౌరస్తా వద్దబుధవారం జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడలో కారు బీభత్సం.. ఘోర ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. ఒకరు మృతిచెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై నందిపాడు చౌరస్తా వద్దబుధవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్ మంగ్హా (45) మిర్యాల గూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు ద్విచక్ర వాహనంపై పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి- నార్కట్పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది. దాంతో పాటు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్ లని, ట్రాక్టర్ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మంగ్త అక్కడికక్కడే మృతిచెందాడు.

మరో ఇద్దరు కురియా తండాకు చెందిన ధనావత్ భాస్కర్, కారు సర్వీసింగ్ సెంటర్ లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయం కోసం ధర్నా :

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంగ్త కుటుంబ సభ్యులు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర నిర్వహించారు దాంతో వాహనాలను మిర్యాలగూడ పట్టణంలో నుంచి దారి మళ్లించడం వల్ల రోడ్డు పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

మరిన్ని వార్తలు