Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్రంపోడు క్రీడాకారుల జోరు..!

అంతర్జాతీయ వేదికపై గుర్రంపోడు మండల క్రీడాకారులు మెరిశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సామూహిక కరాటే ప్రదర్శనలో వీరు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్రంపోడు క్రీడాకారుల జోరు..!

గుర్రంపోడు, మన సాక్షి :

అంతర్జాతీయ వేదికపై గుర్రంపోడు మండల క్రీడాకారులు మెరిశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సామూహిక కరాటే ప్రదర్శనలో వీరు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుండి క్రీడాకారులు తరలివచ్చిన ఈ ఈవెంట్‌లో, గతంలో ఉన్న 8 నిమిషాల రికార్డును అధిగమించి ఏకధాటిగా 11 నిమిషాల పాటు కరాటే పంచులు, బ్లాకులతో అద్భుత ప్రదర్శన ఇచ్చి సరికొత్త రికార్డు నమోదు చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించిన షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ నాంపల్లి కనకారావు, కట్టవారిగూడెం వాసి కట్ట అయోధ్య రాములుకు మండల కేంద్రంలో ఘన స్వాగతం లభించింది.

గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ చేతుల మీదుగా రికార్డు పత్రాన్ని అందుకున్న వీరిని స్థానికులు ఘనంగా సన్మానించారు. గిన్నిస్ విజేతలను అభినందించిన గుర్రంపోడు మాజీ జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్, గుర్రంపోడు సర్పంచ్ జాల యాదయ్య, కట్టవారిగూడెం సర్పంచ్ చాడ ప్రమీల చక్రవర్తి, సెయింట్ మేరీస్ స్కూల్ హెచ్ఎం జోసెఫ్, గుర్రంపోడు ఉపసర్పంచ్ మేకల కోటిరెడ్డి,

కట్టవారిగూడెం ఉపసర్పంచ్ పర్సనబోయిన రాధా వెంకన్న, బీఆర్ఎస్ మండల నాయకులు కూన్ రెడ్డి సైదిరెడ్డి, నారోజు శ్రీకాంత్, షావోలిన్ షోటోఖాన్ జనరల్ సెక్రెటరీ సింధు లవ కుమార్, కట్ట శ్రీను, షేక్ అబ్జల్, మారగోని నరసింహ, షేక్ మోహిన్, కట్ట మల్లేష్, షేక్ తాజుద్దీన్, మారగోని యాదయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై మండల కీర్తిని చాటినందుకు విజేతలను ప్రత్యేకంగా కొనియాడారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు