Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : ఈ దొంగ మామూలోడు కాదు.. వరుస దొంగతనాలను చేధించిన పోలీసులు..! 

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad : ఈ దొంగ మామూలోడు కాదు.. వరుస దొంగతనాలను చేధించిన పోలీసులు..! 

శేరిలింగంపల్లి, మన సాక్షి :

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా చామదాల గ్రామానికి చెందిన వల్లెపు వెంకటేష్, మియాపూర్ ప్రాంతంలో నివసిస్తూ ఇసుక వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నాడు. త్వరగా డబ్బులు సంపాదించాలని దురాశతో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు.

మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి, చందానగర్, ఆర్సీ పూర్, బాలానగర్ వంటి పలు ప్రాంతాల్లో మొత్తం 45 దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. తాజాగా మియాపూర్‌లో జరిగిన చోరీ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి, మయూరి నగర్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 607 గ్రాముల వెండి ఆభరణాలు, 4 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన మియాపూర్ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ రవికిరణ్ రెడ్డి, సీఐ శివప్రసాద్, డీఐ రమేష్ నాయుడు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు