Breaking : మిర్యాలగూడలో వృద్ధురాలిపై దాడి.. బంగారం చోరీ.. సిసి టీవీ వీడియో..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలిపై ఇంట్లో ఉండగా దాడి చేసి బంగారం చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్పగూడెంలో జరిగింది. ఈ ఘటన సమీపంలో ఉన్న సిసి కెమెరా లో కూడా రికార్డ్ అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

Breaking : మిర్యాలగూడలో వృద్ధురాలిపై దాడి.. బంగారం చోరీ.. సిసి టీవీ వీడియో..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం రాత్రి ఓ వృద్ధురాలిపై ఇంట్లో ఉండగా దాడి చేసి బంగారం చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్పగూడెంలో జరిగింది. ఈ ఘటన సమీపంలో ఉన్న సిసి కెమెరా లో కూడా రికార్డ్ అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన బైసాని లక్ష్మమ్మ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి గొలుసు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో లక్ష్మమ్మకు గాయాలయ్యాయి. సమీపంలోని ఒక వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుల వెళ్తున్న వీడియో రికార్డు అయింది.
సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించినట్లుగా, బంగారం దొంగతనానికి సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్మారు. వారు ఒక బైక్‌పై వచ్చారు. ఆ సమయంలో ఒక వ్యక్తి రెడ్ టీషర్ట్ ధరించి, పల్సర్ 150 బైక్‌పై వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెం లో బంగారం చోరీ చేసి బైక్ పై వెళుతున్నట్లుగా అనుమానితులు pic.twitter.com/3uOkZ13SqO
— Mana Sakshi (@ManaSakshiNews) April 29, 2026









