Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : కలెక్టర్ సంచలన నిర్ణయం.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. ఉద్యోగి సస్పెండ్.. తాసిల్దార్, ఎంపీడీవోలకు షాకాజ్ నోటీసులు..!

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాన్యం కొనుగోళ్ల అక్రమాలలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు తాసిల్దారులు, ఎంపీడీవోలకు షోకాజు నోటీసులు జారీ చేశారు.

District Collector : కలెక్టర్ సంచలన నిర్ణయం.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. ఉద్యోగి సస్పెండ్.. తాసిల్దార్, ఎంపీడీవోలకు షాకాజ్ నోటీసులు..!

సూర్యాపేట, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాన్యం కొనుగోళ్ల అక్రమాలలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు తాసిల్దారులు, ఎంపీడీవోలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు
తహశీల్దార్ల, ఎంపీడీవో, ఏఈవో లకు షోకాజ్ నోటీసులు జారిచేశారు.

మండల ప్రొక్యూర్మెంట్ కమిటీ నుండి సంజాయిషీ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు ఎట్టి పరిస్తితుల్లో సహించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఉపేక్షించారు. తుంగతుర్తి తహశీల్దార్ దయనంద్, తిరుమలగిరి తహశీల్దార్ హరి ప్రసాద్, ఎంపిడివో శేషు కుమార్, డివిజన్ వ్యవసాయ అధికారి తుంగతుర్తి రమేష్ బాబు, గొట్టిపర్తి ఏఈఓ జోత్స్న తుంగతుర్తి ఏపిఎం ఎం.యాదమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో రైతుల పేరిట విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం విచారణ చేపట్టి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ఏది ఏమైనాప్పటికి గత పాలకుల నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు తూకాలలో మోసాలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇంకా కొంతమందికి రైతుల పాసుబుక్కుల ధాన్యాల ఆన్లైన్ చేయడం లో నిర్లక్ష్యం చేస్తూ చాలా రోజులకు ఆన్లైన్ చేసి వారికి బిల్లులు చెల్లించుటలో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకాశాలు జరపకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు మండలాల మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు