Kavitha TRS : కవిత పార్టీ పేరు మార్పు.. అయినా టి.ఆర్.ఎస్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఇచ్చిన పార్టీ పేరును ఎన్నికల సంఘం మార్పు చేసింది. అయినా కూడా TRSకు ఆమోదముద్ర వేసింది.

Kavitha TRS : కవిత పార్టీ పేరు మార్పు.. అయినా టి.ఆర్.ఎస్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఇచ్చిన పార్టీ పేరును ఎన్నికల సంఘం మార్పు చేసింది. అయినా కూడా TRSకు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీగా పేరును ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు కవితకు లేఖ అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరును కవిత వెల్లడించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా మరొక పేరును ఖరారు చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం తెలిపింది. ఆ పేరును కవిత పార్టీకి కేటాయిస్తున్నట్లుగా ఎన్నికల సంఘం లేక పంపింది. దాంతో ఆ పార్టీకి సంబంధించిన కీలక ఘట్టం పూర్తయింది.
తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి కవిత వెళ్ళనున్నారు. తెలుగులో పార్టీ పేరులో మార్పులు ఉన్నప్పటికి TRS గా పిలుచుకునే అవకాశం ఆమెకు ఎన్నికల సంఘం కల్పించింది. TRS గుర్తింపుని ఇవ్వడంతో బిఆర్ఎస్ కు కేటీఆర్ కు షాక్ తగిలింది.
పార్టీ పేరు మారిందని కాస్త రిలీఫ్ అయిన బీఆర్ఎస్.. పేరు టిఆర్ఎస్ కావడంతో షాక్ లో ఉన్నారు. పార్టీ పేరు ఖరారు అయిన వెంటనే కవిత తన ఎక్స్ ఖాతాలో మొట్టమొదటిసారిగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రక్షణ సేన కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో సంతోషిస్తున్నామని పేర్కొన్నారు.









