Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

కవితపై రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. తండ్రిని తిట్టడం బాదేసింది..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ పెట్టడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఏదో కొద్ది మందిని తీసుకెళ్లి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి తండ్రిని తిట్టడం సరైనది కాదన్నారు.

కవితపై రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. తండ్రిని తిట్టడం బాదేసింది..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ పెట్టడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఏదో కొద్ది మందిని తీసుకెళ్లి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి తండ్రిని తిట్టడం సరైనది కాదన్నారు. తండ్రి అంటే ఆడపిల్లకు ఎంతో గౌరవం ఉండాలని, కూతురు అంటే తండ్రికి కూడా అంతే ప్రేమ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొదటి మీటింగ్ లోనే తండ్రిని తిట్టడం తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు.

ఆమెకు అన్నతో విభేదాలు ఉండొచ్చు గాని, అధికారం రావాలని ఆశ ఉండొచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన ఆమె తండ్రి కేసీఆర్ ను తిట్టటం చూస్తే బాధేసిందని ఆయన పేర్కొన్నారు. మొదటి సమావేశంలోనే కవిత తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తారు. తండ్రిని గౌరవించుకోలేని వ్యక్తి అమ్మ ఎలా అవుతుంది అని ఆయన అన్నారు.

పార్టీ పెట్టడం అంటే గతంలో కేసీఆర్ అన్నట్లు పాన్ షాప్ పెట్టినట్టు కాదు అని ఆయన పేర్కొన్నారు. ఆమె లిక్కర్ కుంభకోణం లో ఉందని, కోర్టులు ఆమె క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటానికి చాలామంది ఉన్నారు.. కానీ ఆమె కేసును ఆమె చూసుకుంటే మంచిదని రాజగోపాల్ రెడ్డి యూత్ పలికారు. అదే విధంగా కవిత వల్ల ఏమీ కాదని, ఊరు కాలదు పీరు లేవదని సామెత చెప్పడంతో పాటు ఆమె పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు