SSCలో శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు టాప్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల (మాల్ )వీటి నగర్ లో ని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు 100% సాధించడంతోపాటు మండలం టాప్ ర్యాంకులు మా విద్యార్థులు సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బోదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు.

SSCలో శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు టాప్..!
చింతపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల (మాల్ )వీటి నగర్ లో ని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు 100% సాధించడంతోపాటు మండలం టాప్ ర్యాంకులు మా విద్యార్థులు సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బోదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 20 26 కు మా పాఠశాల నుండి 52 మంది విద్యార్థులు జరిగిన పరీక్షలకు హాజరుకాగా అందులో కాసాని సహస్ర 584/600 మార్కులు సాధించి మండలంలో టాప్ ర్యాంకర్ గా నిలిచింది . అదేవిధంగా 578 /600 గడల చిన్ను ద్వితీయ శ్రేణిలో మండల ర్యాంకు సాధించింది.
వీరితోపాటు 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 14 మంది. 500 మార్కుల నుండి 549 మార్కుల వరకు 19 మంది విద్యార్థులు, 434 మార్కుల నుండి, 499 మార్కుల వరకు మరో 19 మంది విద్యార్థులు ఉత్తమ ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగరవేశారు. 52 మంది విద్యార్థులకు 52 మంది విద్యార్థులు మా పాఠశాల నుండి ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.
మా పాఠశాలకు విద్యార్థులు మండల ప్రథమ ద్వితీయ ఉత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తేవడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు పాఠశాల యాజమాన్యం తరఫున తెలియ పరుస్తున్నామని ప్రిన్సిపాల్ బోదాస్ శ్రీనివాస్ పేర్కొన్నారు..