Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!

Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!
నేలకొండపల్లి, మన సాక్షి:
జిల్లా లోని రైతాంగం కు సరిపడ ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య పేర్కోన్నారు. మండలం లోని రామచంద్రాపురం, పైనంపల్లి, నాచేపల్లి, అప్పలనరసింహాపురం లో సొసైటీలను, మంగాపురంతండా లో ఎరువుల దుకాణం ను గురువారం తనీఖీ చేశారు. స్టాక్ న్ను పరిశీలించారు.
విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల తో మాట్లాడారు… జిల్లాలోని రైతులకు జూన్ మాసం కు సంబంధించిన ఎరువులు 25 వేల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎరువుల విక్రయాలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కుత్రిమ కోరత సృష్టించినా… అధిక ధరలకు విక్రయించిన డీలర్ల పై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లా లోని పత్తి రైతులు ప్రస్తుతం విత్తనాలు నాటటం సరైన సమయం కాదని అన్నారు.
రైతాంగం కు సరిపడా 6.61 లక్షల పత్తి విత్తనాల ఫ్యాకెట్ల ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు తెలియని వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.
గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయించినా.. నిబంధనలు ఉల్లంఘించిన… గ్రామాలలోకి వచ్చి విత్తనాలు విక్రయించే వారి పై తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని అన్నారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 6.10 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం ఖరారు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల వ్యవసాయాధికారి యం.రాధ, ఫెర్టిలైజర్స్ డీలర్ ధీరావత్ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!
-
WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!
-
District collector : వరదలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులకు సూచన..!
-
Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!









